Virat Kohli: కోహ్లీ ఖాతాలో చెత్త రికార్డు.. బ్యాటింగ్‌లో మాత్రం కాదు!

Team India Star Virat Kohli Sets Unwanted Record

  • ఆస్ట్రేలియా పర్యటనలోనూ కొనసాగుతున్న కోహ్లీ పేలవ ఫామ్
  • లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విడిచిపెట్టిన కోహ్లీ
  • గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ పేరున చెత్త రికార్డు
  • ఆ తర్వాతి స్థానంలో రోహిత్, కేఎల్ రాహుల్

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఆడి 5 పరుగులు మాత్రమే చేసిన కోహ్లీ హేజెల్‌వుడ్ బౌలింగ్‌లో ఉస్మాన్ ఖావాజాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గత కొంతకాలంగా పరుగుల కోసం ముఖం వాచిపోయేలా ఉన్న కోహ్లీ ఆసీస్ గడ్డపైనా అదే పేలవ ఫామ్‌తో టూర్ ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ అవాంఛిత రికార్డును మూటగట్టుకున్నాడు.

ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో ఓ సింపుల్ క్యాచ్‌ను వదిలిపెట్టేసిన కోహ్లీ చెత్త రికార్డును తన పేరున రాసుకున్నాడు. బుమ్రా బౌలింగ్‌లో లబుషేన్ ఇచ్చిన ఈజీ క్యాచ్‌ను విరాట్ జారవిడిచాడు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో అత్యధిక క్యాచ్‌లు విడిచిపెట్టిన ఆటగాడిగా కోహ్లీ రికార్డులకెక్కాడు. 2019 నుంచి ఇప్పటి వరకు కోహ్లీ ఏకంగా 47 క్యాచ్‌లు విడిచిపెట్టాడు. కోహ్లీ తర్వాతి స్థానంలో టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ, కేఎల్ రాహుల్ ఉన్నారు. వీరిద్దరూ చెరో 21 క్యాచ్‌లు విడిచిపెట్టారు. 20 క్యాచ్‌లు విడిచిపెట్టిన సిరాజ్ వీరి తర్వాతి స్థానంలో ఉన్నాడు.

  • Loading...

More Telugu News