DK Aruna: సర్వేలు తారుమారు: మహారాష్ట్రలో బీజేపీ గెలుపుపై డీకే అరుణ
- కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారన్న డీకే అరుణ
- అందుకే కాంగ్రెస్ కూటమిని తిప్పికొట్టారన్న బీజేపీ ఎంపీ
- రేవంత్ రెడ్డి చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించలేదని వ్యాఖ్య
మహారాష్ట్రలో బీజేపీ కూటమి 'మహాయుతి' గెలుపుపై బీజేపీ నేత, ఎంపీ డీకే అరుణ స్పందించారు. మహారాష్ట్రలో సర్వేలు, అంచనాలు తారుమారయ్యాయన్నారు. ఇప్పటికే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించారని, అందుకే వారి కూటమిని తిప్పికొట్టారన్నారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేశారని, కానీ ఆయన మాటలను అక్కడి ప్రజలు విశ్వసించలేదన్నారు.
మహారాష్ట్ర బీజేపీకి అద్భుత విజయాన్ని ఇచ్చిందని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇక్కడ అభివృద్ధి గెలిచిందని, కాంగ్రెస్ ఓడిందన్నారు. కాంగ్రెస్ కూటమి బూటకపు వాగ్దానాలను తిరస్కరించి, అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రజలు అభినందనీయులు అన్నారు.
ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రజలకు ఉన్న అచంచల విశ్వాసాన్ని ఇది వెల్లడిస్తోందన్నారు. మహారాష్ట్ర నిర్మాణం పట్ల బీజేపీ నిబద్ధతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. విజయాన్ని అందించిన ఈ చారిత్రక క్షణాలు... అభివృద్ధి, సుపరిపాలన ఆకాంక్షించిన ప్రజలందరివీ అన్నారు.