AR Rahaman: దయచేసి నా తండ్రిపై అవాస్తవాలు వ్యాప్తి చేయకండి: ఏఆర్ రెహమాన్ కొడుకు

AR Rahman son defends his father against rumors

  • అవాస్తవ కథనాలు చూస్తుంటే బాధగా ఉందన్న కొడుకు అమీన్
  • ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చేయవద్దని విజ్ఞప్తి
  • వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచన

దయచేసి తన తండ్రిపై అవాస్తవాలు వ్యాప్తి చేయవద్దని, ఇలాంటి ప్రచారాన్ని ఇకనైనా ఆపండని ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తనయుడు అమీన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తన తల్లిదండ్రుల విడాకుల మీద వస్తున్న కథనాలపై స్పందించారు.

తన తండ్రి గురించి అవాస్తవ కథనాలు వస్తున్నాయని, వాటిని చూస్తుంటే చాలా బాధగా ఉందన్నారు. తన తండ్రి ఓ లెజెండ్ అని, వృత్తిపరంగా ఏన్నో ఏళ్ల నుంచి మంచి మ్యూజిక్ అందించడంతో పాటు ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందాడని పేర్కొన్నారు.

తన తండ్రిపై ఎలాంటి ఆధారాలు లేకుండా వదంతులు వ్యాప్తి చేయడం చూస్తుంటే బాధగా ఉందన్నారు. ఒక వ్యక్తి జీవితం గురించి మాట్లాడేటప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. ఇకనైనా అబద్ధపు ప్రచారాన్ని ఆపాలని, ఆయన వృత్తిని గౌరవిద్దామని విజ్ఞప్తి చేశారు.

తమ 29 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ తాము విడిపోతున్నామని రెహమాన్ దంపతులు మంగళవారం ప్రకటించారు. తమ వైవాహిక బంధం ముప్పై ఏళ్లకు చేరుకుంటుందని సంతోషించామని, కానీ అనుకోని విధంగా ముగింపు పలకాల్సి వచ్చిందని రెహమాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

AR Rahaman
Bollywood
  • Loading...

More Telugu News