YS Sharmila: అమెరికాలో అదానీపై కేసు... రేవంత్ రెడ్డికి షర్మిల సూచన

Sharmila suggetion to Revanth Reddy on Adani
  • అదానీ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచన
  • అదానీతో వ్యాపారాలు చేయవద్దన్న షర్మిల
  • రేవంత్ రెడ్డికి షర్మిల సూచనను ప్రస్తావించిన కేటీఆర్
దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న అదానీ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల సూచన చేశారు. అదానీ కంపెనీలను తెలంగాణ సీఎం బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని సూచించారు. అదానీతో ఎలాంటి వ్యాపారాలు చేయవద్దన్నారు. లంచాలు ఇవ్వజూపిన కేసులో అమెరికాలో గౌతమ్ అదానీపై కేసు నమోదైన నేపథ్యంలో రేవంత్ రెడ్డికి షర్మిల సూచన చేశారు.

షర్మిల కూడా రేవంత్ రెడ్డికి సూచించారు: కేటీఆర్

ఢిల్లీలో అదానీని తిడుతున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మాత్రం ఆయనతో దోస్తీ చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి షర్మిల చేసిన సూచనను ప్రస్తావించారు.

అదానీతో ఒప్పందాలపై పునరాలోచన చేయాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల కూడా రేవంత్ రెడ్డికి సూచించారని వెల్లడించారు. ఆమె ఏపీలో మాట్లాడారని, తెలంగాణలో తమ (కాంగ్రెస్) ప్రభుత్వమే ఉందని, కాబట్టి అదానీతో ఒప్పందాలను రద్దు చేయాలని షర్మిల చెప్పినట్లుగా వార్తల్లో చూశానన్నారు. దాదాపు ఏడాదిగా కాంగ్రెస్ అధిష్ఠానం మంత్రివర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్నారు. అలాంటిది అదానీ వ్యవహారంలో అధిష్ఠానం పాత్ర లేకుండా ఎలా ఉంటుందన్నారు.
YS Sharmila
Revanth Reddy
KTR
Telangana
Gautam Adani

More Telugu News