Gold price: బంగారం ధర మళ్లీ పెరిగింది!
- ఒక్క రోజే తులం బంగారం (24 క్యారెట్లు) రూ.1400లు పెరిగి రూ.79,300లకు చేరిక
- కిలో వెండి ధర రూ.93వేలు
- పెట్టుబడిదారులకు బంగారం స్వర్గధామమన్న అనలిస్ట్ జతిన్ త్రివేది
బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అయితే, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో గురువారం ఒక్క రోజే తులం బంగారం (24 క్యారెట్లు) ధర రూ.1400లు పెరిగి రూ.79,300లకు చేరుకుంది. మరో వైపు కిలో వెండి ధర ఫ్లాట్‌గా రూ.93వేల వద్ద కొనసాగింది. బుధవారం 99.9 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.77,900 వద్ద ముగిసింది. గురువారం 99.5 శాతం స్వచ్ఛత గల బంగారం తులం ధర రూ.1400 వృద్ధితో రూ.78,900 వద్ద కొనసాగితే, బుధవారం రూ.77,500 వద్ద ముగిసింది.
మల్టీ కమోడిటీ ఎక్చేంజ్ (ఎంసీఎక్స్) లో డిసెంబర్ డెలివరీ గోల్డ్ కాంట్రాక్ట్స్ ధర రూ.568 పెరిగి రూ.76,602లకు చేరుకుంది. రష్యా - ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో పెట్టుబడిదారులకు బంగారం స్వర్గధామంగా మారిందని ఎల్కేపీ సెక్యూరిటీస్ కమొడిటీ ఆండ్ కరెన్సీ రీసెర్చ్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ జతిన్ త్రివేది పేర్కొన్నారు. అంతర్జాతీయంగా గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర రూ.19.80 డాలర్లు పుంజుకుని 2695.40 డాలర్లకు చేరుకుంది. అలాగే ఔన్స్ వెండి ధర కూడా రూ.31.53 డాలర్లు పలికింది.