Nallamilli Ramakrishna Reddy: ఆ ఆస్తులు స్వార్జితమో, పితృ ఆర్జితమో కాదు: వైఎస్ కుటుంబ ఆస్తుల గొడవపై ఎమ్మెల్యే నల్లమిల్లి
- ఆస్తుల కోసం ఏ సీఎం పిల్లలు కూడా రోడ్డు మీద పడి కొట్టుకోలేదన్న నల్లమిల్లి
- అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారని విమర్శ
- ఆ ఆస్తులను ఈడీ, సీబీఐ సీజ్ చేశాయని వ్యాఖ్య
వైసీపీ అధినేత జగన్ కుటుంబంలో ఆస్తుల గొడవలు రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. జగన్, ఆయన తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల మధ్య నెలకొన్న ఈ గొడవలపై బీజేపీ అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి పిల్లలు కూడా ఆస్తుల కోసం రోడ్డు మీద పడి కొట్టుకోలేదని ఎద్దేవా చేశారు.
వీరు గొడవ పడుతున్న ఆ ఆస్తులు స్వార్జితమో, పితృ ఆర్జితమో కాదని నల్లమిల్లి అన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తుల కోసం తల్లి, పిల్లలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. పైగా ఆ ఆస్తులను ఈడీ, సీబీఐ సీజ్ చేశాయని చెప్పారు. అలాంటి ఆస్తుల కోసం వీరు కొట్టుకోవడం ఏమిటని ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. వీళ్లు సంపాదించని, వీళ్లవి కాని ఆస్తుల కోసం గొడవ పడుతుండటంపై అందరూ చర్చించుకుంటున్నారని తెలిపారు.