Vijayasai Reddy: ఐక్యరాజ్యసమితిలో విజయసాయిరెడ్డి

Vijayasai Reddy in UNO

  • ఐక్యరాజ్యసమితికి వెళ్లిన భారత బృందం
  • ఈనెల 23 వరకు జరగనున్న సెషన్
  • గాంధీ విగ్రహానికి విజయసాయి నివాళి

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఐక్యరాజ్యసమితి భద్రతామండలిని సందర్శించారు. ఐక్యరాజ్యసమితి 79వ సెషన్ కు వెళ్లిన భారత ప్రతినిధి బృందంలో విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లిన సందర్భంగా జనరల్ అసెంబ్లీ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహానికి విజయసాయి నివాళి అర్పించారు. ఈ నెల 23 వరకు ఈ సెషన్ జరగనుంది. శాంతి, అంతర్యుద్ధాలు తదితర అంశాలపై భారత్, ఇతర దేశాల ప్రతినిధులు జనరల్ అసెంబ్లీలో మాట్లాడనున్నారు.

Vijayasai Reddy
YSRCP
UNO
  • Loading...

More Telugu News