AP Assembly Session: రిషికొండ ప్యాలెస్‌పై నేడు శాసనసభలో చర్చ

Short Discussion on Rushi Konda Polavaram and other Irrigation projects in ap assembly

  • టిడ్కో గృహాలపై జరిగిన స్వల్ప కాలిక చర్చకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
  • ఈ రోజు రుషికొండ ప్యాలెస్, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టులపై శాసనసభలో సల్పకాలిక చర్చకు స్పీకర్ అనుమతి
  • ఈ రోజు వేర్వేరు బిల్లులను ప్రవేశపెట్టనున్న మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు

గత వైసీపీ హయాంలో రుషికొండలో నిర్మించిన ప్యాలెస్‌పై శాసనసభలో ఈ రోజు (మంగళవారం) స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నారు. ఈ ప్యాలెస్ కోసం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారనే దానిపై పలువురు సభ్యులు ఇప్పటికే సభలో ప్రశ్నలు అడిగారు. దీనికి తోడు సోమవారం సభలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ.. టిక్నో గృహాలపై శాసనసభలో నిర్వహించిన చర్చకు మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందన్నారు. అలాగే రోజుకు ఒక సబ్జెక్ట్ (రుషికొండ, ఇసుక, మద్యం విక్రయాల్లో జరిగిన కుంభకోణం)పైన స్వల్ప కాలిక చర్చ నిర్వహిస్తే బాగుంటుందని సూచించారు. 

దీంతో ముందుగా రుషికొండ ప్యాలెస్ వ్యవహారం, సాగునీటి ప్రాజెక్టులపై పూర్తి స్థాయిలో చర్చ చేపట్టాలని సభ్యులు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో శాసనభలో జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను అతిక్రమిస్తూ రుషికొండపై విలాసవంతమైన భవనాల అక్రమ నిర్మాణం, మరియు ప్రజా ధనం దుర్వినియోగంపై లఘు చర్చతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలవరం, ఇతర నీటి పారుదల ప్రాజెక్టులపై లఘు చర్చ నిర్వహణకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుమతినిస్తూ మంగళవారం అజెండాలో వీటిని పొందుపర్చారు. 
 
అలాగే ఏపీ ఎక్సైజ్ చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన మూడు వేర్వేరు బిల్లులను మంగళవారం ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రవేశపెట్టనున్నారు. ఏపీ సహకార సంఘాల చట్టంలో సవరణతో మరో బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెడతారు.   

  • Loading...

More Telugu News