newzealand cricketer: కొకైన్ వాడి నిషేధానికి గురైన న్యూజిలాండ్ క్రికెటర్

newzealand cricketer doug bracewell banned for month after cocaine positve

  • డ్రగ్స్  తీసుకుని దొరికిపోయిన న్యూజిలాండ్ పేస్ బౌలర్ బ్రాస్‌వెల్
  • డ్రగ్స్ తీసుకున్నందుకు పశ్చాత్తాపం పడుతూ, వైద్యం చేయించుకున్న బ్రాస్‌వెల్ 
  • మూడు నెలల సస్పెన్షన్‌ను నెల రోజులకు తగ్గించిన కివీస్ క్రికెట్ కమిషన్  

న్యూజిలాండ్ పేస్ బౌలర్ డగ్లస్ బ్రాస్‌వెల్‌పై ఒక నెల నిషేధం వేటు పడింది. అతను నిషేధిత డ్రగ్స్ (కొకైన్) తీసుకోవడంతో న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో సెంట్రల్ స్టేజ్, వెల్లింగ్ టన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో రెండు వికెట్లు, 30 పరుగులతో రాణించిన డోగ్ బ్రాస్ వెల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. 

అయితే.. ఏప్రిల్ నెలలో అతడు కొకైన్ తీసుకుని వైద్య పరీక్షలో దొరికిపోయాడు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమిషన్ అతనిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. మరోసారి అలాంటి తప్పిదానికి పాల్పడకుండా మూడు నెలల పాటు నిషేధం విధించింది. అయితే.. బ్రాస్‌వెల్ తను కొకైన్ వాడినందుకు పశ్చాత్తాపపడుతూ, వైద్యం చేయించుకున్నాడు. దీంతో అతనిపై సస్పెన్షన్‌ను మూడు నెలల నుంచి ఒక నెలకు పరిమితం చేస్తూ కివీస్ క్రికెట్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పటికే నిషేధ సమయం పూర్తి కావడంతో మళ్లీ దేశం తరుపున ఆడేందుకు బ్రాస్‌వెల్ సిద్ధమవుతున్నాడు. ఇకపోతే ఆల్ రౌండర్ అయిన బ్రాస్‌వెల్ చివరిసారిగా 2023లో న్యూజిలాండ్‌కు ఆడాడు. న్యూజిలాండ్ తరపున 28 టెస్టులు, 21 వన్డేలు, 20 టీ 20 మ్యాచ్‌లలో ఆడాడు. దేశం తరపున ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా అంతర్జాతీయ టీ 20 లీగ్స్‌లో బ్రాస్‌వెల్ ఆల్ రౌండర్‌గా రాణిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News