jio: జియో నుంచి తాజాగా సూపర్ ప్లాన్

jio offers 1 year unlimited 5g upgrade for rs 601

  • రిలయన్స్ జియో కొత్త వోచర్ 
  • రూ.601 అప్‌గ్రేడ్ వోచర్‌తో ఏడాది అంతా అపరిమితంగా 5జీ డేటా సేవలు
  • 4జీ వినియోగదారులకూ ఈ వోచర్ సాయంతో 5జీ సేవలు

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో ..వినియోగదారులకు బంపర్ ఆఫర్ లాంటి సూపర్ ప్లాన్ తీసుకువచ్చింది. సంస్థ తీసుకువచ్చిన కొత్త వోచర్‌‌తో ఏడాది అంతా అపరిమితంగా 5జీ డేటా సేవలను ఆనందించవచ్చు. అపరిమిత 5జీ డేటా సేవలకు గానూ రూ.601తో అప్ గ్రేడ్ వోచర్‌ను తీసుకువచ్చింది. 4జీ వినియోగదారులు సైతం ఈ వోచర్ సాయంతో 5జీ సేవలను పొందవచ్చు. 
 
జియో 5జీ సేవలు తీసుకొచ్చినప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్, నెట్‌వర్క్ ఉన్న వారందరికీ వెల్‌కమ్ ఆఫర్ కింద ఉచిత 5జీ డేటాను అందించింది. రూ.239 కంటే ఎక్కువ రీచార్జి చేసిన వారందరికీ ఈ సదుపాయాన్ని కల్పించింది. ఈ ఏడాది జులైలో ప్లాన్ల ధరల సవరణ సందర్భంగా అపరిమిత 5జీ డేటాకు పరిమితి నిర్దేశించింది సంస్థ. ఎవరైతే రోజుకు 2జీబీ డేటా అందించే ప్లాన్‌ను రీచార్జి చేసుకుని ఉంటారో వారికి మాత్రమే అపరిమిత 5జీ డేటాను ఆఫర్ చేస్తోంది. అంటే నెలకు రూ.349 ప్లాన్ రీచార్జి చేసే వారికే ఉచిత 5జీ డేటా అన్నమాట.
 
అయితే, తక్కువ డేటా ప్లాన్ తీసుకునే వారికీ 5జీ సేవలు అందించేందుకు ఆ మధ్య సంస్థ రూ.51, రూ.101, 151తో బూస్టర్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. తాజాగా ఏడాది పొడవునా అపరిమిత 5జీ డేటాను అందించేందుకు రూ.601 వోచర్‌ను జియో తీసుకువచ్చింది. దీన్ని జియో యాప్‌లో కొనుగోలు చేసి యాప్‌లోనే యాక్టివేట్ చేసుకోవచ్చు. అంతే కాకుండా కావాలంటే స్నేహితులకూ ఈ వోచర్‌ను గిఫ్ట్‌లా పంపుకోవచ్చని జియో చెబుతోంది.  

jio
unlimited 5g
rs 601 Vochar
  • Loading...

More Telugu News