Vijay Devarakonda: హిట్టుకి దూరంలో .. సక్సెస్ తొందరలో యంగ్ హీరోలు!
![Young Heros Special](https://imgd.ap7am.com/thumbnail/cr-20241118tn673b3033f2538.jpg)
- వెంటాడుతున్న పరాజయాలు
- ఉక్కిరిబిక్కిరవుతున్న హీరోలు
- కొత్తదనం కోసం కొనసాగిస్తున్న కసరత్తులు
- అయినా కనిపించని విజయాలు
- వచ్చే ఏడాదిపైనే అందరి ఆశలు
ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ హీరోలు సరైన హిట్ లేక సతమతమైపోతున్నారు. కథల విషయంలో గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. కొత్తగా కనిపించడానికే ట్రై చేస్తున్నారు. అయినా సక్సెస్ మాత్రం ఒక పట్టాన పట్టుబడటం లేదు. నాని కాస్త నిలకడగా ముందుకు వెళుతుండగా, మిగతా వాళ్లు సక్సెస్ ను సాధించే ప్రయత్నంలో ఇబ్బంది పడుతూనే ఉన్నారు.
టాలీవుడ్ లోని యంగ్ హీరోల్లో విజయ్ దేవరకొండకి గల క్రేజ్ వేరు. ఆయనను సరైన హిట్ పలకరించి చాలా కాలమే అయింది. ఈ ఏడాది కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది. దాంతో వచ్చే ఏడాది అయినా గట్టి హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. 'ఏజెంట్' తరువాత అఖిల్ ఇంతవరకూ మరో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని రాలేకపోయాడు. త్వరలో రెండు ప్రాజెక్టులతో బిజీ అయ్యే పనుల్లో ఉన్నాడు. వాటిలో అనిల్ దర్శకత్వంలో చేసే 'ధీర' ఒకటి.
![](https://imgc.ap7am.com/froala-uploads/20241118fr673b2fd1d6206.jpg)
ఇక చాలా రోజులుగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న హీరోల జాబితాలో నాగశౌర్య కూడా కనిపిస్తున్నాడు. 'రంగబలి' తరువాత సైలైంట్ గా ఉండిపోయిన నాగశౌర్య, రామ్ దేశిన అనే కొత్త దర్శకుడితో కలిసి రీసెంటుగా సెట్స్ పైకి వెళ్లాడు. శర్వానంద్ .. కార్తికేయ .. సుధీర్ బాబు వంటి హీరోలంతా కూడా సాధ్యమైనంత త్వరలో హిట్టుకొట్టాలనే పట్టుదలతో ఉన్నారు. చూడాలి మరి వచ్చే ఏడాదైనా వాళ్లకి కలిసొస్తుందేమో.