Singer: పంజాబ్ సింగర్ దిల్జిత్ సింగ్‌పై తెలంగాణలో కేసు నమోదు

After Telangana notice to Diljit Dosanjh singer challenges states to ban liquor

  • నిబంధనలు ఉల్లంఘించారంటూ కేసు నమోదు
  • కేసు నమోదు చేసిన ఆర్జీఐ పోలీసులు
  • మూడ్రోజుల క్రితం కాన్సెర్ట్ షోలో పాల్గొన్న దిల్జిత్ సింగ్

పంజాబ్ సింగర్ దిల్జిత్ సింగ్‌పై తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించారంటూ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్(ఆర్జీఐ) పోలీసులు ఈ కేసును నమోదు చేశారు. మూడు రోజుల క్రితం (15వ తేదీన) శంషాబాద్ నోవాటెల్ వద్ద దిల్జిత్ సింగ్ కాన్సెర్ట్ షోలో పాటలు పాడారు.

ఈ షో నిర్వహణకు ముందే రంగారెడ్డి జిల్లా పోలీసులు దిల్జిత్ సింగ్‌కు నోటీసులు ఇచ్చారు. డ్రగ్స్ మద్యం, హింసను ప్రోత్సహించేలా ఈ షో ఉండకూడదని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. దిల్జిత్ సింగ్ గత అక్టోబర్‌లో ఢిల్లీలోని జేఎన్‌యూలో నిర్వహించిన కాన్సర్ట్ షోలో డ్రగ్స్, మద్యం, హింసను ప్రేరేపించేలా పాటలు పాడారంటూ చండీగఢ్‌కు చెందిన ప్రొఫెసర్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు నోటీసులు జారీ చేశారు.

నోటీసులపై దిల్జిత్ సింగ్ ఆగ్రహం

గత శనివారం నిర్వహించిన మ్యూజిక్ కాన్సర్ట్ షోకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాను పాడిన లెమొనేడ్‌ పాటలో "తైను తేరీ కోక్ చ పంసంద్ ఆ లెమొనేడ్" అని పాడారు. ఒరిజినల్‌గా కోక్ స్థానంలో దారు అంటే మద్యం అనే పదం ఉండాలి. ఇక మరో పాట ఫైవ్ స్టార్‌లో కూడా లిరిక్స్ మార్చి పాడారు.

షో సందర్భంగా అక్కడికి వచ్చిన అభిమానులనుద్దేశించి దిల్జిత్ సింగ్ మాట్లాడారు. విదేశాల నుంచి వచ్చి పాడే సింగర్లపై ఎలాంటి ఆంక్షలు విధించరని, కానీ తనపై మాత్రం తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని వాపోయారు. ఒక ఆర్టిస్ట్ ఇంత దూరం వచ్చి అభిమానులను అలరించే సంగీత విభావరిలో పాల్గొని మంచి పాటలు పాడితే ప్రభుత్వాలు ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. భగవంతుడు తనతో ఉన్నాడని, ఇలాంటి ఆంక్షలు తననేమీ చేయలేవన్నాడు. గుజరాత్ లాగా ప్రతి రాష్ట్రం మద్యంను బ్యాన్ చేయాలని సవాల్ చేశారు. అప్పుడు పాటలు పాడవద్దని ఆంక్షలు విధించాలన్నారు.

  • Loading...

More Telugu News