Ayyanna Patrudu: తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోండి: అయ్యన్నపాత్రుడు ఆదేశం
- జగనన్న కాలనీలపై అసెంబ్లీలో చర్చ
- అధికారులు ఇస్తున్న నివేదికలకు, వాస్తవాలకు మధ్య తేడా ఉందన్న అయ్యన్న
- జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఆదేశం
ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగనన్న కాలనీల గురించి మాట్లాడుతూ... అధికారులు ఇస్తున్న నివేదికలకు, వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా తేడా ఉందని ఆయన అన్నారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు తీసుకుంటే మిగిలిన అధికారులు అలా చేయరని అన్నారు.
తప్పుడు నివేదికలు ఇచ్చే పద్ధతులను అధికారులు వెంటనే మానుకోవాలని హితవు పలికారు. అసెంబ్లీకి తప్పుడు రిపోర్టులు ఇచ్చిన అధికారులపై యాక్షన్ తీసుకుంటే... మిగిలిన అధికారులు సెట్ అవుతారని చెప్పారు. జగనన్న కాలనీలపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని అన్నారు.
ఈ నేపథ్యంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ... జగనన్న కాలనీలపై విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారని తెలిపారు. జగనన్న కాలనీలపై శాఖాపరమైన విచారణతో పాటు విజిలెన్స్ విచారణ కొనసాగుతోందని చెప్పారు.