YS Vivekananda Reddy: ఈ ఉదయం వైఎస్ వివేకా పీఏ ఇంటికి పోలీసులు... డీఎస్పీ సమక్షంలో వాంగ్మూలం నమోదు

Police records YS Vivekananda Reddy PA statement

  • వైఎస్ సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, సీబీఐ ఎస్పీపై కృష్ణారెడ్డి ప్రైవేటు కేసు
  • ఆ ముగ్గురిపై కేసు నమోదు
  • న్యాయవాదుల సమక్షంలో కృష్ణారెడ్డిని విచారించిన పోలీసులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా పీఏ కృష్ణారెడ్డి ఇంటికి ఈ ఉదయం పోలీసులు వెళ్లారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ సమక్షంలో కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. 

2022లో వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి, గతంలో సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ లపై పులివెందుల కోర్టులో కృష్ణారెడ్డి ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశారు. ఆయన ఫిర్యాదుతో ఆ ముగ్గురిపై కేసు నమోదయింది. ఈ నేపథ్యంలోనే కృష్ణారెడ్డి వాంగ్మూలాన్ని పోలీసులు రికార్డు చేశారు. న్యాయవాదుల సమక్షంలో ఆయనను విచారించారు.  

YS Vivekananda Reddy
  • Loading...

More Telugu News