Whatsapp Number: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... రైతుల కోసం వాట్సాప్ నెంబర్

AP Govt brings Whatsapp number for farmer

  • రైతులు ధాన్యం విక్రయించేందుకు సులభమైన ప్రక్రియ
  • వాట్సాప్ ద్వారా సేవలు
  • రైతులు ధాన్యం విక్రయించేందుకు టైమ్ స్లాట్ విధానం

రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక వాట్సాప్ నెంబరును అందుబాటులోకి తీసుకువచ్చింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 73373 59375 నెంబరు ద్వారా ఏపీ ప్రభుత్వం సేవలు అందించనుంది. ఈ నెంబరుకు వాట్సాప్ లో హాయ్ అని సందేశం పంపగానే, ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయి.

దీనిపై ఏపీ ఆహారం, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. రైతులు తమ ధాన్యం విక్రయించే క్రమంలో వారికి సమయం వృథా కాకుండా ఈ వాట్సాప్ నెంబరును తీసుకువచ్చామని చెప్పారు. వాట్సాప్ ద్వారా రైతులు తమ ధాన్యం విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకోవచ్చని, నిర్దేశించిన సమయంలో వెళ్లి కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్లి ధాన్యం విక్రయించవచ్చని నాదెండ్ల వివరించారు.

ఈ వాట్సాప్ నెంబరు ద్వారా సేవలు పొందాలనుకునే రైతులు తొలుత తమ ఆధార్ కార్డుతో కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. 

  • Loading...

More Telugu News