Pawan Kalyan: నా పిల్లలు ఇద్దరితో నేను మరాఠీలో మాట్లాడుతాను: బల్లార్పూర్ లో పవన్ కల్యాణ్

Pawan Kalyan says he talks with his two children in Marathi language

  • మహారాష్ట్రలో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం
  • బల్లార్పూర్ సభకు హాజరు
  • భాషపై గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని వెల్లడి
  • ప్రతి ఒక్కరూ కనీసం ఐదు భాషలు నేర్చుకోవాలన్న ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థుల తరఫున నేడు రెండో రోజు ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం ఆయన బల్లార్పూర్ లో ఎన్డీయే అభ్యర్థి సుధీర్ ముంగటివార్ కు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా పవన్ ప్రసంగిస్తూ... తనకు మరాఠీ భాష అంటే గౌరవం అని వెల్లడించారు. భాష పట్ల గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన ఇద్దరు పిల్లలతో మరాఠీలో మాట్లాడతానని తెలిపారు. విదేశీ భాషలు నేర్చుకోవడంపై ఆసక్తి చూపించే మనం... మన సరిహద్దు రాష్ట్రాల భాషలు కూడా నేర్చుకోవాలి కదా అని సున్నితంగా చురక అంటించారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలు నేర్చుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. 

ఇక, రాజకీయ వ్యాఖ్యలు చేస్తూ... తాను ఏపీలో మార్పు తీసుకొచ్చి చూపించానని, వైసీపీని ఓడించలేరు అంటే ఓడించి చూపించానని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మరాఠా ప్రజలకు కూడా ఎన్డీయే ప్రభుత్వాన్ని గెలిపించి, అభివృద్ధి కొనసాగేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. 

మహారాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా, బల్లార్పూర్ అభివృద్ధి చెందాలన్నా, రూ.లక్ష కోట్ల ఆర్థిక వ్యవస్థగా మహారాష్ట్ర అవతరించాలన్నా... ఎన్డీయే కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని అన్నారు.

  • Loading...

More Telugu News