Konda Surekha: కలెక్టర్ పై దాడి చేయించింది కేటీఆరే: కొండా సురేఖ

Konda Surekha fires on KTR

  • అమాయకులను కేటీఆర్ బలి చేస్తున్నారన్న సురేఖ
  • కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని విమర్శ
  • వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధాని చేసే దిశగా అడుగులు పడుతున్నాయని వ్యాఖ్య

లగచర్లలో కలెక్టర్ పై దాడి చేయించింది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరేనని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. వెనుక ఉండి కేటీఆర్ దాడి చేయించారని అన్నారు. అమాయకులను కేటీఆర్ బలి చేస్తున్నారని చెప్పారు. 

ఫోన్ ట్యాపింగ్ లో ఉన్న అధికారులను విదేశాల్లో దాచారని కొండా సురేఖ విమర్శించారు. బీఆర్ఎస్ నేతలకు పిచ్చి పట్టిందని... వాళ్లంతా సైక్రియాటిస్ట్ కు చూపించుకోవాలని అన్నారు. వాస్తవాలు వెలుగు చూసిన తర్వాత కేటీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ దుష్టపాలనను అంతమొందించి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా విజయోత్సవ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా లక్ష మంది మహిళలతో విజయోత్సవ సభను నిర్వహిస్తామని తెలిపారు. వరంగల్ ను రాష్ట్రానికి రెండో రాజధానిగా చేసే దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పారు.

Konda Surekha
Congress
KCR
KTR
BRS
  • Loading...

More Telugu News