Narendra Modi: నైజీరియా చేరుకున్న మోదీ.. వందేమాతరం నినాదాలతో ఘన స్వాగతం

Modi received grand welcome in Nigeria
  • తొలిసారి నైజీరియాలో పర్యటిస్తున్న మోదీ
  • నైజీరియా దేశాధ్యక్షుడితో భేటీ కానున్న మోదీ
  • నైజీరియా నుంచి బ్రెజిల్ కు బయల్దేరనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ నైజీరియాకు చేరుకున్నారు. నైజీరియాలో మోదీ పర్యటిస్తుండటం ఇదే తొలిసారి. ప్రధాని రాక నేపథ్యంలో అక్కడ సందడి నెలకొంది. నైజీరియాలో నివసిస్తున్న భారతీయులు పెద్ద సంఖ్యలో అబుజా ఎయిర్ పోర్టుకు చేరుకుని మోదీకి ఆహ్వానం పలికారు. భారత్ మాతాకీ జై, వందేమాతరం నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధానికి ఘన స్వాగతం పలికారు. వారికి కరచాలనం చేస్తూ ప్రధాని ముందుకు సాగారు.

మరోవైపు ఎక్స్ వేదికగా మోదీ స్పందిస్తూ... నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీ ఇంత ఆత్మీయంగా, ఉత్సాహభరితంగా స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. 

నైజీరియా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు బోలా అహ్మద్ తో భేటీ అవుతారు. సమావేశంలో ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చిస్తారు. నైజీరియా నుంచి మోదీ బ్రెజిల్ కు బయల్దేరుతారు. బ్రెజిల్ లో రేపు జీ20 సదస్సులో పాల్గొంటారు. ఎల్లుండి గయానాలో పర్యటిస్తారు. ఈ నెల 21 వరకు మోదీ గయానాలో ఉంటారు. 


Narendra Modi
BJP
Nigeria

More Telugu News