Sajjala Ramakrishna Reddy: వైసీపీ రాష్ట్ర సమన్వయకర్తగా సజ్జల... జగన్ ఆదేశాలు
- ఇటీవల ఎన్నికల్లో వైసీపీ ఓటమి
- పార్టీ నిర్మాణంపై దృష్టి సారించిన జగన్
- పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్
- ఒంగోలు ఇన్చార్జిగా చుండూరు రవి నియామకం
- ఈ మేరకు జగన్ ఆదేశాలతో వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన
ఇటీవల ఎన్నికల్లో ఓటమి అనంతరం, వైసీపీ అధినేత జగన్ పార్టీ నిర్మాణంలో మార్పులు చేర్పులు చేస్తున్నారు. తాజాగా, వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ గా సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. ఈ మేరకు జగన్ ఆదేశాలతో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
సజ్జల గత ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించడం తెలిసిందే. దాదాపు జగన్ తర్వాత పవర్ హౌస్ సజ్జల అనేంతగా ఆయన హవా నడిచింది.
ఇక, వైసీపీ రాష్ట్ర కార్యదర్శులను కూడా నేడు నియమించారు. జగన్ ఆదేశాలతో వైసీపీ రాష్ట్ర కార్యదర్శులుగా కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ, బొడ్డేడ ప్రసాద్ లను నియమించారు. కిల్లి వెంకట గోపాల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేత కాగా, బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి జిల్లాకు చెందినవారు.
ముఖ్యంగా, ఇటీవల ఒంగోలు నియోజకవర్గ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన నేపథ్యంలో... ఒంగోలు నియోజకవర్గానికి కూడా ఇన్చార్జిని నియమించారు. ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్తగా చుండూరు రవిని నియమిస్తూ జగన్ ఆదేశాలు ఇచ్చారు.