Gautam Gambhir: మా టాప్-7 బ్యాట్స్ మెన్ అందరికీ ఆ సత్తా ఉంది: గంభీర్

Gambhir confidant on Team India top 7 batsman playing four sessions

  • ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా
  • జియో ఓటీటీకి ఇంటర్వ్యూ ఇచ్చిన గంభీర్
  • 11 గంటల పాటు ఆడగలిగే సత్తా తమ బ్యాటర్లకు ఉందని వెల్లడి

ఇటీవల టీమిండియా హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన  గౌతమ్ గంభీర్ కు ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో అగ్నిపరీక్ష ఎదురైంది. కొన్నిరోజుల కిందటే న్యూజిలాండ్ జట్టు టీమిండియాను వైట్ వాష్ చేసిన నేపథ్యంలో... గంభీర్ మెడపై కత్తి వేలాడుతోంది! 

నవంబరు 22 నుంచి టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు టీమిండియా ఆసీస్ గడ్డపై అడుగుపెట్టింది. ఈ క్రమంలో కోచ్ గంభీర్ జియో ఓటీటీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. 

ప్రస్తుతం టీమిండియా టెస్టు జట్టులో 11 గంటల పాటు బ్యాటింగ్  చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు ఎంతమంది ఉన్నారనే ప్రశ్నకు గంభీర్ బదులిచ్చాడు. తమ జట్టులోని టాప్-7 బ్యాట్స్ మన్లందరూ 11 గంటల పాటు (నాలుగు సెషన్లు) ఆడగలిగిన సత్తా ఉన్నవాళ్లేనని స్పష్టం చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, శుభ్ మాన్ గిల్, యశస్వి జైస్వాల్ వంటి బ్యాట్స్ మన్లు రోజంతా ఆడగలరని గంభీర్ ధీమా వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ యూనిట్ రాణిస్తే ప్రత్యర్థిపై పైచేయి సాధించడం సులభమని పేర్కొన్నాడు. 

కాగా, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టు నవంబరు 22 నుంచి పెర్త్ లో జరగనుంది. ఇప్పటికే పెర్త్ చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు.

  • Loading...

More Telugu News