New Zealand: న్యూజిలాండ్ పార్లమెంట్‌లో బిల్లును చించేసి... డ్యాన్స్ చేస్తూ మహిళా ఎంపీ నిరసన... వీడియో వైరల్

New Zealand MP Leads Traditional Dance Rips Up Copy Of Bill In Parliament

  • నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
  • ట్రీటి ప్రిన్సిపిల్స్ బిల్లును చించేసిన మహిళా ఎంపీ
  • తన స్థానం నుంచి పోడియం వరకు డ్యాన్స్ చేస్తూ నిరసన

న్యూజిలాండ్ మహిళా ఎంపీ హనా రవితి కరేరికి ఓ బిల్లును వ్యతిరేకిస్తూ అక్కడి పార్లమెంట్‌లో ఆ బిల్లును చించివేసి, ఆ తర్వాత సంప్రదాయ మావోరి నృత్యం చేస్తూ నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె ఆ దేశంలోని మావోరి తెగకు చెందిన మహిళ. న్యూజిలాండ్ లో అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీగా ఉన్నారు. హనా రాహితి వయసు 22 సంవత్సరాలు.

పార్లమెంట్‌లో వివాదాస్పద ట్రీటీ ప్రిన్సిపుల్స్ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో ఆమె నిరసన చేపట్టారు. ఈ బిల్లును రెండు ముక్కలుగా చించేశారు.

ఆ తర్వాత మావోరి సంప్రదాయ నృత్యం చేశారు. గట్టిగా ఓ పాట పాడుతూ... డ్యాన్స్ చేస్తూ తన స్థానం నుంచి పోడియం దిశగా వస్తున్న వీడియో ఇది. ఆమెతో పాటు పలువురు సభ్యులు, గ్యాలరీలో ఉన్న వారు కూడా డ్యాన్స్ చేశారు. ఒకటిన్నర నిమిషాల ఈ వీడియోను కెల్విన్ మోర్గాన్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.

More Telugu News