South Africa Vs India: భారత్-దక్షిణాఫ్రికా మూడో టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు
- బౌలింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు కెప్టెన్ మార్ర్కమ్
- తొలుత బ్యాటింగ్ చేయనున్న టీమిండియా
- అరంగేట్రం చేసిన పేసర్ రమణ్‌దీప్ సింగ్
భారత్-దక్షిణాఫ్రికా మధ్య నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మూడవ మ్యాచ్‌కు తెరలేచింది. నేడు సెంచూరియన్‌లోని సూపర్‌స్పోర్ట్ పార్క్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. ఆతిథ్య సఫారీ జట్టు కెప్టెన్ మార్క్రమ్ టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగింది. పేసర్ అవేశ్ ఖాన్ స్థానంలో మరో పేసర్ రమణ్‌దీప్ సింగ్‌కు అరంగేట్ర అవకాశం ఇచ్చింది.
టాస్ సందర్భంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ... తాము తొలుత బ్యాటింగ్ చేసిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ బాగానే ఆడామని గుర్తుచేశాడు. కుర్రాళ్లు స్పష్టమైన ఆలోచనతో బరిలోకి దిగి, టీమ్ ప్లాన్ ను ఆచరిస్తున్నారని, ఈ విషయంలో సంతోషంగా ఉన్నానని అన్నాడు. యువ ఆటగాళ్లు వారి ప్రదర్శనతో తన పనిని సులభం చేస్తున్నారని మెచ్చుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేశామని, అవేశ్ ఖాన్ స్థానంలో రమణ్‌దీప్ సింగ్‌ని తుది జట్టులోకి తీసుకున్నట్టు చెప్పాడు. అవేశ్ ఖాన్ బాగానే రాణించినప్పటికీ జట్టులో ఒక స్థానం కోసం త్యాగం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాడు.
తుది జట్లు..
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రమణ్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి.
దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ర్యాన్ రికెల్టన్, రీజా హెండ్రిక్స్, ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), డేవిడ్ మిల్లర్, మార్కో యన్‌సెన్, ఆండిల్ సిమిలానే, గెరాల్డ్ కోయెట్జీ, కేశవ్ మహరాజ్, లూథో సిపమ్లా.