KTR: నరేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్... కన్నీరుమున్నీరైన తల్లి... ఇదిగో వీడియో

KTR visits Patnam Narendar Reddys residence

  • లగచర్ల దాడి ఘటనకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
  • జుబ్లీహిల్స్‌లోని పట్నం నరేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన కేటీఆర్
  • నరేందర్ రెడ్డి భార్య శృతి, తల్లికి ధైర్యం చెప్పిన కేటీఆర్

మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. లగచర్ల దాడిలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే అనుమానంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో ఆయన కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శిస్తున్నారు. ఉదయం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి... నరేందర్ రెడ్డి భార్యను పరామర్శించారు. కాసేపటి క్రితం కేటీఆర్ కూడా వారి కుటుంబాన్ని పరామర్శించారు.

నరేందర్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్‌లోని జుబ్లీహిల్స్‌లో గల ఆయన నివాసానికి వెళ్లిన కేటీఆర్... భార్య శృతి, తల్లిని కలిసి మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. కేటీఆర్‌ను చూసి పట్నం నరేందర్ రెడ్డి తల్లి కన్నీరుమున్నీరు అయ్యారు. కేటీఆర్ ఆమె పక్కన కూర్చొని భుజం తడుతూ ధైర్యం చెప్పారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు.

KTR
Telangana
BRS
Congress

More Telugu News