AP Assembly Session: మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ పై అసెంబ్లీలో చర్చ.. హోంమంత్రి జవాబు

Andhra Pradesh Assembly Question Hour

  • జాబ్ చార్ట్ విషయంలో గందరగోళం నెలకొందన్న సభ్యులు
  • దానికి గత ప్రభుత్వ నిర్వాకమేనని బదులిచ్చిన హోంమంత్రి అనిత
  • ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి జాబ్ చార్ట్ రూపొందించారని విమర్శ

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల విషయంలో గత ప్రభుత్వం తుగ్లక్ నిర్ణయాలు తీసుకుందని హోంమంత్రి అనిత ఆరోపించారు. సలహాదారుల ఉచిత సలహాలతో కార్యదర్శుల జాబ్ చార్ట్ ను రూపొందించారని, దీనికోసం అప్పటి ప్రభుత్వం రెండుసార్లు జీవోలు ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వంలో ఉన్న శాఖలు అన్నింటినీ కలిపి కార్యదర్శుల జాబ్ చార్ట్ రూపొందించారని తెలిపారు. దీంతో కార్యదర్శుల జాబ్ చార్ట్ పై గందరగోళం నెలకొందని వివరించారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో కార్యదర్శులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.

గ్రామస్థాయిలో శాంతిభద్రతల పరిరక్షణ నుంచి అంగన్ వాడీలో పిల్లల సంరక్షణ వరకూ వారికి అన్ని బాధ్యతలను అప్పగించారని విమర్శించారు. ఈమేరకు అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. గ్రామ సచివాలయంలో మహిళా సంరక్షణ కార్యదర్శుల జాబ్ చార్ట్ విషయంలో నెలకొన్న గందరగోళాన్ని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, ఆ తర్వాత వారికి తగిన బాధ్యతలు అప్పగిస్తామని హోంమంత్రి అనిత చెప్పారు.

  • Loading...

More Telugu News