Haiti Airport: విమానం ల్యాండవుతుండగా కాల్పులు.. హైతీలో ఘటన

A plane was hit by gunfire en route to the capital of Haiti

  • తిరిగి గాల్లోకి లేచిన విమానం పొరుగు దేశంలో ల్యాండింగ్
  • విమానానికి తగిలిన బుల్లెట్లు.. సిబ్బందికి గాయాలు
  • గ్యాంగ్ వార్ తో అట్టుడుకుతున్న హైతీ

విమానాశ్రయంలో దిగుతున్న ఓ విమానంపై కొంతమంది దుండగులు కాల్పులు జరిపారు. విమానానికి బుల్లెట్లు తగలడంతో పైలట్ అక్కడ ల్యాండ్ చేయకుండా పక్కనే ఉన్న మరో దేశానికి మళ్లించాడు. సేఫ్ గా ల్యాండయ్యాక చూస్తే విమానం బయట పలుచోట్ల బుల్లెట్స్ తగిలి దెబ్బతినడం కనిపించింది. విమానంలోని సిబ్బంది ఒకరు స్వల్పంగా గాయపడ్డాడు. కరీబియన్ దేశం హైతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. హైతీలో గ్యాంగ్ వార్ ముదరడంతో దేశం అట్టుడుకుతోందని, ఈ క్రమంలోనే దుండగులు విమానంపైకి కాల్పులు జరిపారని అధికారులు తెలిపారు.

స్పిరిట్ ఎయిర్ వేస్ కు సంబంధించిన ఓ ఫ్లైట్ ఫ్లోరిడా నుంచి హైతీకి బయలుదేరింది. సోమవారం ఉదయం హైతీ రాజధానిలోని పోర్ట్ ఔ ప్రిన్స్ లో విమానాన్ని ల్యాండ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. దాదాపు వంద అడుగుల ఎత్తుకు చేరుకున్నాక సడెన్ గా భూమి మీద నుంచి విమానంపైకి కాల్పులు జరిగాయి. బుల్లెట్లు తగిలి విమానం దెబ్బతింది. దీంతో విమానాన్ని మళ్లీ పైకి లేపిన పైలట్.. హైతీకి పొరుగున ఉన్న డొమినికన్ రిపబ్లికన్ కు మళ్లించాడు. అక్కడ సేఫ్ గా దించాక చూస్తే విమానం బయటా లోపలా బుల్లెట్స్ తగిలిన గుర్తులు కనిపించాయి. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

More Telugu News