Chirumarti Lingaiah: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం... మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
- మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు నోటీసులు
- విచారణకు ఈరోజే హాజరు కావాలని నోటీసులు
- ఈ కేసులో తొలిసారి ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి ఓ రాజకీయ నాయకుడికి నోటీసులు జారీ అయ్యాయి.
ఈ కేసులో నిందితుడు తిరుపతన్నతో ఫోన్ కాంటాక్ట్స్ ఉండటంతో జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. చిరుమర్తి లింగయ్య నకిరేకల్ నుంచి2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2010లో తెలంగాణ కోసం రాజీనామా చేసినప్పటికీ స్పీకర్ ఆమోదించలేదు. 2011లో మరోసారి రాజీనామా చేశారు. 2018లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన లింగయ్య... ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.