Gautam Gambhir: భారత ఆటగాళ్లపై సోషల్ మీడియాలో విమర్శలు... స్పందించిన గౌతమ్ గంభీర్

Gautam Gambhir confirms India captain if Rohit Sharma misses

  • సోషల్ మీడియాలో ఆటగాళ్లను టార్గెట్ చేస్తే పట్టించుకోమన్న గంభీర్
  • టీమిండియాకు వ్యక్తిగత రికార్డ్స అవసరం లేదు... జట్టే ముఖ్యమని వెల్లడి
  • ఓపెనింగ్‌కు తమ వద్ద ఆప్షన్స్ ఉన్నాయన్న గౌతమ్ గంభీర్

కివీస్‌తో టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత సోషల్ మీడియాలో ఆటగాళ్లపై విమర్శలు రావడంపై భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ స్పందించాడు. క్రికెటర్లను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారని... అయితే అలాంటి వాటిని పట్టించుకోమని వెల్లడించాడు. భారత డ్రెస్సింగ్  రూంలో అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. వారితో కలిసి పని చేయడం కోచింగ్ సిబ్బంది కూడా గౌరవంగా భావిస్తోందన్నాడు.

టీమిండియాకు వ్యక్తిగత రికార్డ్స్ అవసరం లేదని, తమకు జట్టు ముఖ్యమని గంభీర్ తెలిపాడు. తమకు జట్టు స్ఫూర్తి అత్యంత కీలకమని పేర్కొన్నాడు. మిగతా అన్నీ తమకు చిన్న విషయాలే అన్నాడు. అయితే జట్టు విజయాల్లో అవే ముఖ్య భూమికను పోషిస్తాయన్నాడు.

ఇప్పుడు ఉన్న యువ ఆటగాళ్లు తమను తాము నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారని వెల్లడించాడు. కివీస్ టెస్ట్ సిరీస్‌లో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించినందుకు విమర్శలు వచ్చాయని... కానీ అతను మంచి ప్రదర్శన చేశాడన్నాడు. ధ్రువ్ జురెల్ కూడా ఆస్ట్రేలియా-ఏతో బాగా రాణించాడని గుర్తు చేశాడు.

ఆస్ట్రేలియాలో సవాల్‌కు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఆస్ట్రేలియాలో చాలా కఠిన పరిస్థితులు ఉంటాయని వెల్లడించాడు. సిరీస్‌లో తాము మొదటి నుంచే దూకుడు ప్రదర్శించే ప్రయత్నం చేస్తామన్నాడు. సవాళ్లను ఎదుర్కొంటామన్నాడు.

తమ వద్ద ఓపెనింగ్ కోసం ఎన్నో ఆప్షన్లు ఉన్నాయని... అభిమన్యు ఈశ్వరన్, కేఎల్ రాహుల్... ఇలా ఎవరినైనా బరిలోకి దింపుతామన్నాడు. తుది జట్టుపై ఇప్పుడే ఓ అంచనాకు రాలేమన్నాడు. శుభ్‌మన్ గిల్‌ను ఓపెనింగ్‌కు పంపిస్తామా? లేదా? ఇప్పుడు చెప్పలేమన్నాడు. కానీ అద్భుతమైన జట్టుతో ఆడుతామని స్పష్టం చేశాడు. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కోసం తాము ఇప్పుడైతే ఆలోచించడం లేదని తేల్చి చెప్పాడు. తమకు ప్రతి మ్యాచ్, సిరీస్ కీలకమే అన్నాడు. ఆసీస్ పిచ్‌లు పేస్‌కు అనుకూలంగా ఉంటాయన్నాడు.

  • Loading...

More Telugu News