Zebra: 'జీబ్రా' ట్రైలర్ లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
![Chiranjeevi will attesn Zebra trailer launch](https://imgd.ap7am.com/thumbnail/cr-20241110tn6730c48629532.jpg)
- సత్యదేవ్, డాలీ ధనంజయ ముఖ్యపాత్రల్లో జీబ్రా
- ఈ మల్టీ స్టారర్ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్వకత్వం
- నవంబరు 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రం
- ఈ నెల 12న ట్రైలర్ రిలీజ్
వెర్సటైల్ యాక్టర్ సత్యదేవ్ కొంచెం గ్యాప్ తీసుకుని నటించిన చిత్రం జీబ్రా. ఇదొక మల్టీ స్టారర్ చిత్రం ఇందులో కన్నడ స్టార్ హీరో డాలీ ధనంజయ కూడా నటించారు. ఈ చిత్రానికి ఈశ్వర్ కార్తీక్ దర్శకుడు.
వాస్తవానికి ఈ చిత్రం అక్టోబరు 31న దీపావళి సందర్భంగా రిలీజ్ కావాల్సి ఉండగా... నవంబరు 22కి వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని మేకర్స్ గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న జరగనున్న ఈ ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండడంతో... జీబ్రా చిత్రంపై అందరి ఫోకస్ పడింది. చిరంజీవి చేతుల మీదుగా జీబ్రా ట్రైలర్ ను ఆవిష్కరించనున్నారు.
ఇటీవల చిరంజీవిని జీబ్రా చిత్రబృందం కలిసి, ఈవెంట్ కు రావాల్సిందిగా ఆహ్వానించింది. ఆయన వెంటనే ఓకే చెప్పేశారు. జీబ్రా ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లోని పార్క్ హయట్ హోటల్ లో జరగనుంది.
![](https://img.ap7am.com/froala-uploads/20241110fr6730c44e67fc9.jpg)