Uttar Pradesh: ‘నీట్’ విద్యార్థినిపై టీచర్ల అత్యాచారం

NEET Aspirant Raped in Uttar Pradesh Kanpur

  • ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఘటన
  • పార్టీ ఇస్తున్నానని ఇంటికి పిలిచి మద్యం తాగించి టీచర్ అత్యాచారం
  • ఆపై వీడియో తీసి బ్లాక్ మెయిలింగ్
  • అనంతరం మరో టీచర్ కూడా అఘాయిత్యం

‘నీట్’కు శిక్షణ పొందుతున్న విద్యార్థినిపై ఇద్దరు టీచర్లు నెలల తరబడి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. నిందితుల్లో ఒకడు గతంలోనే ఓ మహిళను లైంగికంగా వేధించిన కేసులో అరెస్టయి బెయిలుపై బయటకు వచ్చినట్టు పోలీసులు తెలిపారు. 

నీట్ కోచింగ్ కోసం 2022లో బాధిత విద్యార్థిని కాన్పూరు వచ్చి ఓ పాప్యులర్ కోచింగ్ సెంటర్‌లో చేరింది. విద్యార్థులందరికీ పార్టీ ఇస్తున్నానని, నువ్వు కూడా రావాలంటూ ఈ ఏడాది జనవరిలో బయాలజీ టీచర్ సాహిల్ సిద్దిఖీ (32) ఆమెను ఇంటికి ఆహ్వానించాడు. ఆమె వెళ్లాక అక్కడ ఎవరూ లేకపోవడాన్ని గుర్తించింది. సాహిల్ ఆమెతో మద్యం తాగించి ఆపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనను వీడియో తీశాడు. 

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో బయటపెడతానని, తన కుటుంబాన్ని చంపేస్తానని సిద్దిఖీ తనను బెదిరించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆ తర్వాత నిందితుడు ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆమెను తన ఫ్లాట్‌లో కొన్ని రోజులపాటు నిర్బంధించాడు. అక్కడ 39 ఏళ్ల కెమిస్ట్రీ టీచర్ వికాశ్ పోర్వాల్ కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో బాధితురాలు మైనర్ అని పోలీసులు తెలిపారు. 

తాను హోలీ జరుపుకొనేందుకు ఇంటికి వెళ్లినప్పుడు సిద్దిఖీ ఫోన్ చేసి తనను వెంటనే వెనక్కి రావాలని ఆదేశించాడని, రాకుంటే తన కుటుంబానికి హాని చేస్తానని బెదిరించాడని బాధితురాలు పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేశారు.

Uttar Pradesh
NEET
Kanpur
Crime News
  • Loading...

More Telugu News