M Vijayaraju: ఏపీ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం.విజయరాజు సస్పెన్షన్

AP Assembly secretary general suspends assebly joint secretary

  • అసెంబ్లీ సెక్రటరీ జనరల్ పేరు మీద డీజీపీకి లేఖ రాసిన విజయరాజు
  • తీవ్రంగా పరిగణించిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్
  • గవర్నర్ సిఫారసులతో విజయరాజుపై వేటు

ఏపీ ప్రభుత్వ యంత్రాంగంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఎం.విజయరాజుపై సస్పెన్షన్ వేటు పడింది. గవర్నర్ ఆదేశాల నేపథ్యంలో, ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్ నేడు ఉత్తర్వులు జారీ చేశారు. 

సెక్రటరీ జనరల్ ఢిల్లీలో ఉన్న సమయంలో, ఆయన పేరుతో డీజీపీ కార్యాలయానికి విజయరాజు లేఖ రాసినట్టు గుర్తించారు. గత అసెంబ్లీ చీఫ్ మార్షల్ దియో ఫిలస్ పై అసెంబ్లీలో ఎలాంటి రిమార్కు లేదని విజయరాజు ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పటికే దియో ఫిలస్ పై చర్యలు తీసుకోవాలని నివేదిక వచ్చినప్పటికీ, విజయరాజు డీజీపీకి లేఖ రాయడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.

తన పేరు మీద లేఖ రాయడం, దియో ఫిలస్ సత్ప్రవర్తనతో కూడిన వ్యక్తి అని విజయరాజు పేర్కొనడం పట్ల అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన అసెంబ్లీ సెక్రటరీ జనరల్ ఆ మేరకు నివేదికను గవర్నర్ కు పంపించారు. గవర్నర్ సిఫారసుల మేరకు అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి విజయరాజుపై వేటు వేశారు.

  • Loading...

More Telugu News