IOCL: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ ఖాళీలు.. కావాల్సిన అర్హతల వివరాలు!

Apply Online for 240 Graduate and Technician Diploma Apprentice Posts

  • ఏపీ, తెలంగాణలలో 240 పోస్టుల భర్తీ
  • మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక
  • ఈ నెల 29 తో ముగియనున్న దరఖాస్తు గడువు

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, మహారత్న కంపెనీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) తాజాగా నియామక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 240 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు సంబంధించి అర్హతగల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ నెల 29 లోగా దరఖాస్తు చేసుకోవాలని, వచ్చే నెల 6 న మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తామని తెలిపింది. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి అప్రెంటీసులుగా తీసుకుంటామని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు నెల‌కు రూ.11,500, డిప్లొమా అభ్య‌ర్థుల‌కు నెల‌కు రూ.10,500 స్టైఫండ్ గా చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఖాళీలు, అర్హతల వివరాలు..
మెకానిక‌ల్, సివిల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ అండ్ కంట్రోల్ ఇంజ‌నీరింగ్ విభాగాల్లో ఒక్కోదాంట్లో 20 చొప్పున మొత్తం 120 ఖాళీలు ఉన్నాయి. సంబంధింత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్- ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఖాళీలు కూడా 120 ఉన్నాయని, బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీసీఏ, బీబీఎం పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. ఈ విద్యార్హతలు కలిగిన 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కంపెనీ తెలిపింది. మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయనున్నట్లు వెల్లడించింది.

  • Loading...

More Telugu News