Cybercrime: సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సైబర్ మోసం.. కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ

Cyber Security Alert To Telangana People Fake Survey Links In Online

  • మొబైల్ కు ఇలాంటి లింక్ వస్తే క్లిక్ చేయొద్దంటున్న పోలీసులు
  • సర్వే పేరుతో ఫోన్ చేసి ఓటీపీ అడిగితే చెప్పొద్దని హెచ్చరిక
  • అధికారులే నేరుగా ఇంటికి వచ్చి సర్వే చేస్తారని వెల్లడి

తెలంగాణలో సరికొత్త సైబర్ ఫ్రాడ్ కు కేటుగాళ్లు తెరలేపారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, ఈ సర్వే పేరుతో లింక్ లు పంపించి బ్యాంకు ఖాతాలను కొల్లగొడుతున్నారని హెచ్చరించారు. కుటుంబ సర్వే పేరుతో మొబైల్ ఫోన్ కు ఎలాంటి లింక్ వచ్చినా ఓపెన్ చేయొద్దని సూచించారు. ఒకవేళ ఈ లింక్స్ నిజమే అనుకుని క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలోని సొమ్ము మొత్తం కాజేస్తారని చెప్పారు. దీంతో పాటు కుటుంబ సర్వే పేరుతో ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా స్పందించవద్దని సైబర్ పోలీసులు హెచ్చరించారు. సర్వే కోసం కాల్ చేశామని చెప్పి ఓటీపీ అడిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పొద్దన్నారు.

ఈ నెల 6 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రారంభమైంది. ఈ సర్వే కోసం అధికారులు, ప్రభుత్వ సిబ్బంది నేరుగా మీ ఇంటికే వస్తారని, వివరాలు నమోదు చేసుకుని వెళతారని సైబర్ పోలీసులు స్పష్టత నిచ్చారు. ఫోన్ ద్వారా, ఆన్ లైన్ లింక్ ల ద్వారా సర్వే చేయడంలేదని వివరించారు. ఈ సర్వే పేరుతో ఏదైనా లింక్ లు కానీ ఫోన్ కాల్ కానీ వస్తే స్పందించవద్దని సూచించారు. సైబర్ కేటుగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తగా ఉండాలంటూ ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News