Mallu Bhatti Vikramarka: హైడ్రా కూల్చివేతల భయం... బ్యాంకర్లకు భట్టి విక్రమార్క భరోసా

Bhattivikramarka meets Bankers in Praja Bhavan

  • ప్రజాభవన్‌లో బ్యాంకర్లతో భట్టివిక్రమార్క సమావేశం
  • హైడ్రాపై ఆందోళన అవసరం లేదని స్పష్టీకరణ
  • స్వయం సహాయక బృందాలకు రుణాలు ఇవ్వాలని సూచన

హైడ్రా విషయమై బ్యాంకర్లకు తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ధైర్యం చెప్పారు. బ్యాంకర్లు హైడ్రా కూల్చివేతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాభవన్‌లో ఆయన బ్యాంకర్లతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ వంటి ప్రభుత్వ విభాగాలు అన్ని అంశాలను పరిశీలించాకే నిర్మాణాలకు అనుమతి ఇస్తాయని స్పష్టం చేశారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చిన రుణాల రికవరీ రేటు 98 శాతానికి పైగా ఉందని బ్యాంకర్లకు తెలిపారు. కాబట్టి వారికి పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. బ్యాంకర్లు సామాజిక బాధ్యతతో ఉండాలని హితవు పలికారు.

Mallu Bhatti Vikramarka
Congress
Telangana
  • Loading...

More Telugu News