Sri Ram: ఓటీటీలోకి అడుగుపెడుతున్న మరో మిస్టరీ థ్రిల్లర్!

Harikatha Web Series Update

  • హాట్ స్టార్ లో మిస్టరీ థ్రిల్లర్ గా 'హరికథ'
  • 8 ఎపిసోడ్స్ గా పలకరించనున్న కంటెంట్ 
  • ప్రధాన పాత్రల్లో శ్రీరామ్ - అర్జున్ అంబటి 
  • పోస్టర్స్ తోనే ఆసక్తిని పెంచిన సిరీస్ 
  • త్వరలోనే రానున్న స్ట్రీమింగ్ డేట్


 ఈ మధ్య కాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ల సంఖ్య పెరుగుతోందనే చెప్పాలి. త్వరలో మరో తెలుగు సిరీస్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఆ సిరీస్ పేరే 'హరికథ' .. సంభవామి యుగే యుగే అనేది ఉప శీర్షిక. త్వరలో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 8 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను స్ట్రీమింగ్ చేయనున్నారు. 

ఇంతవరకూ వరుస సినిమాలు నిర్మిస్తూ వచ్చిన పీపుల్ మీడియా వారు, మొదటిసారిగా ఈ సిరీస్ ను నిర్మించడం విశేషం. భారీ సినిమాలను నిర్మించిన ఈ బ్యానర్, ఈ వెబ్ సిరీస్ ను కూడా భారీస్థాయిలో నిర్మించే అవకాశం ఉందనే విషయం అర్థమవుతోంది. మైథలాజికల్ టచ్ తో కూడిన మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో ఈ సిరీస్ ను రూపొందించారు. 

ఫస్టు లుక్ పోస్టర్ తోనే అంచనాలు పెంచిన ఈ సిరీస్, తెలుగు .. తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది. శ్రీరామ్ .. అర్జున్ అంబటి .. దివి .. పూజిత పొన్నాడ .. రాజేంద్ర ప్రసాద్ .. ప్రధానమైన పాత్రలను పోషించారు. కథ ఎలా ఉండనుందనేది ఆడియన్స్ లో కుతూహలాన్ని పెంచుతోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ రానుంది. 

Sri Ram
Arjun Ambati
Divi
Rajendra Prasad
  • Loading...

More Telugu News