Donald Trump: హార్టీ కంగ్రాచ్యులేషన్స్ మై ఫ్రెండ్: ట్రంప్ విజయంపై మోదీ స్పందన

Modi congratulates Donald Trump

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ జోరు
  • ట్రంప్ విజయం దాదాపు ఖరారు
  • మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పిద్దాం అంటూ మోదీ ట్వీట్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం దాదాపు ఖాయమైంది. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించినందుకు హృదయపూర్వక అభినందనలు మిత్రమా అంటూ ట్వీట్ చేశారు. 

"గతంలో మీ హయాంలో జరిగిన అభివృద్ధి పునాదిగా నేటి మీ విజయం సాకారమైంది. ఈ క్రమంలో భారత్-అమెరికా మధ్య సమగ్ర అంతర్జాతీయ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడం కోసం మన సంబంధాలకు పునరుజ్జీవం కల్పించడంపై దృష్టి సారిద్దాం. మన ఇరు దేశాల ప్రజల జీవితాలను మెరుగుపర్చేందుకు, ప్రపంచశాంతి వికాసానికి, స్థిరత్వానికి, శ్రేయస్సు కోసం కలసికట్టుగా పాటుపడదాం" అంటూ మోదీ ట్వీట్ చేశారు. 

Donald Trump
Narendra Modi
US Presidential Polls
  • Loading...

More Telugu News