Roja: ఎవరి మెప్పు కోసం ఈ దాపరికాలు?: అనితపై రోజా ఫైర్

Roja fires on Anitha

  • తిరుపతిలో పదో తరగతి బాలికపై లైంగిక దాడి
  • తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన రోజా
  • కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గుపడాలంటూ ట్వీట్

ఏపీ హోంమంత్రి అనితపై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. తిరుపతిలో పదో తరగతి బాలికపై జరిగిన లైంగిక దాడి విషయంపై రోజా స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

'గౌరవ హోంమంత్రి అనిత గారు మరియు ఎస్పీ గారు... ఒక్కసారి మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆత్మపరిశీలన చేసుకోండి. ఆ ఆడబిడ్డ తండ్రి తన బిడ్డకి జరిగిన అన్యాయానికి దోషులను ఉరితీయాలని, తన బిడ్డకు న్యాయం చెయ్యాలని వేడుకుంటుంటే... ఆయన ఆవేదన మీకు కనిపించడం లేదా? ఆ తండ్రి బాధ మీకు కనిపించలేదా? ఎవరి మెప్పు కోసం ఈ దాపరికాలు? వాస్తవాలు దాచి కేసును పక్కదారి పట్టిస్తున్నందుకు సిగ్గు పడండి' అని రోజా ట్వీట్ చేశారు. 

Roja
YSRCP
Vangalapudi Anitha
Telugudesam
  • Loading...

More Telugu News