Krithi Shetty: కోలీవుడ్ లో దూసుకుపోతున్న కృతి శెట్టి!

Krithi Shetty Special

  • తెలుగులో వరుస ఫ్లాపులతో ఉన్న కృతి శెట్టి
  • తమిళ .. మలయాళ సినిమాలపై ఫోకస్ 
  • 'ARM'తో మలయాళంలో దక్కిన పెద్ద హిట్
  • తమిళంలో వరుస ప్రాజెక్టులతో బిజీ 


తెలుగు తెరకి భారీ విజయంతో పరిచయమైన భామలు కొంతమందే ఉన్నారు. అలాంటి హీరోయిన్స్ లో కృతి శెట్టి ఒకరుగా కనిపిస్తుంది. 'ఉప్పెన' సినిమాతో ఈ బ్యూటీ పరిచయమైంది. ఈ సినిమా విజయంలో ఆమె గ్లామర్ ప్రధానమైన పాత్రను పోషించిందని చెప్పక తప్పదు. ఆ తరువాత అదే జోరును కొనసాగిస్తూ హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది. అందంతో పాటు అదృష్టం కూడా ఉందని అంతా అనుకున్నారు. 

కానీ ఆ తరువాతనే కృతి శెట్టికి పరాజయాలు ఎదురవుతూ రావడం మొదలైంది. గ్లామర్ విషయంలో వంకబెట్టవలసిన పనిలేదు. డాన్స్ విషయంలోను ఈ బ్యూటీ శభాష్ అనిపించుకుంది. ఇక ఈ ట్రెండ్ కి అవసరమైనంత యాక్టింగ్ ఉంది. కానీ దురదృష్టం కొద్దీ ఆమెను ఫ్లాపులు పలకరించడం ఎక్కువైపోయింది. అదే సమయంలో టాలీవుడ్ నుంచి ఆమెకి అవకాశాలు తగ్గడం మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆమె తమిళ .. మలయాళ సినిమాలపై శ్రద్ధ పెట్టింది. 

మలయాళంలో టోవినో థామస్ తో ఆమె చేసిన 'ARM' .. ఈ ఏడాది అక్కడి బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 30 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, 100 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పుడు మలయాళం నుంచి ఆమెకి అవకాశాలు 'క్యూ' కడుతున్నాయి. ఇదే సమయంలో ఆమె కోలీవుడ్ లోను బిజీ అవుతుండటం విశేషం. తమిళంలో కార్తీ .. జయం రవి .. ప్రదీప్ రంగనాథన్ జోడీగా ఆమె చేస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Krithi Shetty
Karthi
Jayam Ravi
Pradeep Ranganathan
  • Loading...

More Telugu News