Vijayasai Reddy: రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు... శకుని: విజయసాయిరెడ్డి

Vijayasaireddy cyptic post in social media

  • ఆసక్తికర ట్వీట్ చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి
  • జెండా కూలీల్లారా... నేనూ మీలో ఒకడ్ని అంటూ ట్వీట్
  • ఎంత కొట్టుకున్నా ఉపయోగం లేదు అంటూ వ్యాఖ్యలు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి "నా ప్రియమైన జెండా కూలీల్లారా... నేను కూడా మీలో ఒకడ్ని" అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. "మనం ముందుగా పోరాడాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం... ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్నా ఉపయోగం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది అన్న కాదు.... శకుని. 

వైసీపీ, జగన్ గారు అధికారంలోకి వస్తే, ఆయన ఆశీస్సులతో నేను కేంద్రంలో మంత్రినయితే... చట్ట సవరణ చేసి కార్మికులను, కూలీలను లాభాల్లో భాగస్వాములను చేస్తాం. లాభాల్లో 10 శాతం వాటా ఇవ్వడమే కాకుండా, దాన్ని తప్పనిసరి చేస్తూ, దానిపై పన్ను కూడా మినహాయింపు చేస్తాం" అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Vijayasai Reddy
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News