Road Accident: కోదాడ వద్ద ప్రైవేటు బస్సును ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. 30 మందికి గాయాలు

road accident in kodada

  • జాతీయ రహాదారిపై కోదాడ వద్ద ఘటన 
  • ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతుండగా ప్రమాదం
  • కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు 

ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ఘటన హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ సమీపంలోని కట్టకొమ్ముగుడెం వద్ద జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు జాతీయ రహదారిపై కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. 

ఈ ప్రమాదంలో 30 మంది ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. రోడ్డు ప్రమాద సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వల్ప గాయాలతోనే ప్రయాణికులు బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. 

Road Accident
RTC Bus
Kodada
Telangana
  • Loading...

More Telugu News