Telangana: మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్, రెండో స్థానంలో ఏపీ

Telangana first in Liquor sales

  • దక్షిణాది రాష్ట్రాలలో మద్యం అమ్మకాల లెక్కలు  
  • తెలంగాణలో సగటున ఒక్కొక్కరు రూ.1,623 ఖర్చు  
  • ఏపీలో ఒక్కొక్కరు రూ.1,306 ఖర్చు చేసినట్లు వెల్లడి

మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్‌గా నిలిచింది. రాష్ట్రంలో ప్రతిరోజూ లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు సాగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణలో గత ఏడాది సగటున ఒక్కొక్కరు రూ.1,623 మద్యం కోసం ఖర్చు చేయగా... ఏపీలో రూ.1,306 ఖర్చు చేసినట్లు ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ (ఎన్ఐపీఎఫ్‌పీ) అంచనా వేసింది.

పంజాబ్‌లో రూ.1,245, ఛత్తీస్‌గఢ్‌లో రూ.1,227 చొప్పున ఒక్కో వ్యక్తి ఖర్చు చేశారు. పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని వ్యక్తులు మద్యం కోసం తక్కువ ఖర్చు చేస్తున్నారు. 

తెలంగాణలో 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. మరో వెయ్యి వరకు బార్లు, పబ్స్ ఉన్నాయి. ఇటీవల దసరా సందర్భంగా దాదాపు రూ.1,000 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. 11 లక్షల కేసుల మద్యం, 18 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగినట్లు అంచనా.

దక్షిణాదిన తెలంగాణలోనే బీర్ల విక్రయాలు అత్యధికంగా అమ్ముడవుతున్నాయని సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్య బీర్లు తాగిన వారి సంఖ్య 302.84 లక్షలు అని వెల్లడైంది. ఏపీలో 169 లక్షల బీర్లు అమ్ముడయ్యాయి. మద్యం వల్ల తెలంగాణలో ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది.

Telangana
Liquor
Beer
Andhra Pradesh
  • Loading...

More Telugu News