Air India: ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం .. అమెరికాకు 60 విమానాలు రద్దు
- నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు యూఎస్‌కి 60 విమానాలను రద్దు చేసిన ఎయిర్ ఇండియా
- నిర్వహణ, ఎయిర్ క్రాఫ్ట్ సమస్యల కారణంగా రద్దు చేసినట్లు ప్రకటన
- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడి
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాకు 60 విమాన సర్వీసులను రద్దు చేసింది. నిర్వహణ సమస్యలు, ఎయిర్ క్రాఫ్ట్ లు అందుబాటులో లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది నవంబర్ 15 నుండి డిసెంబర్ 31 వరకూ భారత్ - అమెరికా రూట్లలో విమానాలను రద్దు చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది.
కస్టమర్లకు సమాచారం అందించామని, ఎయిర్ ఇండియా గ్రూపు ద్వారా నడపబడుతున్న ఇతర విమానాల్లో తర్వాతి రోజులకు సర్వీసుని ఆఫ్ చేసినట్లు సంస్థ తెలిపింది. ఢిల్లీ - చికాగో రూట్‌లో 14 విమానాలు, ఢిల్లీ - వాషింగ్టన్ రూట్‌లో 28, ఢిల్లీ - ఎస్ఎఫ్‌వో మధ్య 12 విమానాలు, ముంబయి - న్యూయార్క్ మార్గంలో నాలుగు విమానాలతో పాటు ఢిల్లీ - నెవార్క్ రూట్‌లో రెండు విమానాలను ఎయిర్ ఇండియా రద్దు చేసింది. ఈ క్రమంలో ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో పాటు పూర్తి రిఫండ్‌ని ఆఫర్ చేస్తోంది.