Nara Lokesh: ఇండియాస్పోరా, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో మంత్రి లోకేశ్ భేటీ
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్టార్టప్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా అభివృద్ధి చెందుతోందన్న మంత్రి
- ఏఐ వర్సిటీ, డాటా సెంటర్లు రాబోతున్నాయని తెలిపిన లోకేశ్
- పెట్టుబడులకు ఇదే సరైన సమయమంటూ వ్యాఖ్య
- అభివృద్ధి వికేంద్రీకరణమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్న మంత్రి లోకేశ్
యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్, ఇండియాస్పోరా ప్రతినిధులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్టాన్సిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సమావేశం అయ్యారు. ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు, సువిశాలమైన తీర ప్రాంతం, విస్తృతమైన రోడ్డు, జల, వాయు రవాణా మార్గాలు కలిగిన ఏపీలో పెట్టుబడులకు పూర్తి అనుకూల వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఇదే మంచి సమయమని అన్నారు.
ఇంకా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ శరవేంగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. రాబోయే రోజుల్లో ఏపీ స్టార్టప్ హబ్, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు కాబోతోందని తెలిపారు. పరిశ్రమలకు అవసరమైన ఎకో సిస్టమ్ ను అభివృద్ధి చేస్తున్నమన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా అనుమతుల కోసం ఎకనమిక్ డెవలప్ మెంట్ బోర్డును పునరుద్దరించినట్లు తెలిపారు.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా అనంతపురంలో ఆటోమొబైల్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, విశాఖలో ఐటీ, ఫార్మా, వైద్యపరికరాల తయారీ, ప్రకాశంలో బయోఫ్యూయల్, గోదావరి జిల్లాలో ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సహం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్హానంతో త్వరలో అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్నాయన్నారు. అంతర్జాతీయ స్థాయి నిపుణులను తీర్చిదిద్దేందుకు వీలుగా ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అన్నివిధాలా అనుకూల వాతావరణం నెలకొన్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలని మంత్రి లోకేశ్ కోరారు.
ఈ సమావేశంలో ఇండియాస్పోరా ఫౌండర్ రంగస్వామి, యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఎగ్జిక్యూటివ్ సభ్యులు కవితా మరియప్పన్ (జడ్ స్కేలర్), శివ శివరాం (సీఈఓ, క్వాంటమ్ స్కోప్), రమాకాంట్ ఆలపాటి (సీఈఓ, యూల్డ్ ఇంజనీరింగ్ సిస్టమ్స్), సోహిల్ చావ్లా (ఫౌండర్ అండ్ సీఈఓ టీ సెకండ్), అన్యా మాన్యుయల్ (ప్రిన్సిపాల్, రైస్ హాడ్లీ గేట్స్ అండ్ మాన్యుయల్ ఎల్ఎల్‌సీ), రియా షిమా (గ్లోబల్ బిజినెస్ హెడ్, జెట్ సింథసిస్), డీన్ గార్ ఫీల్డ్ (వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ, నెట్ ఫ్లిక్స్), మిచైల్ డిపాలా కోయ్లే (హెడ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ పాలసీ, ఐబిఎం), నిక్ క్లెగ్ ( ప్రెసిడెంట్, మెటా గ్లోబల్ ఎఫైర్స్), బెకీ ఫ్రాసర్ ( వైఎస్ ప్రెసిడెంట్, క్వాల్కమ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), చంతాల్ అలకంత్రా (ఎండి, లాంరీసెర్చ్ గ్లోబల్ గవర్నమెంట్ ఎఫైర్స్), ప్రభురాజా (ప్రెసిడెంట్, సెమీకండక్టర్స్ పొడక్ట్ గ్రూప్, అప్లయ్డ్ మెటీరియల్స్) పాల్గొన్నారు.
అలాగే గ్రేస్ కోహ్ (వైస్ ప్రెసిడెంట్, గవర్నమెంట్ రిలేషన్స్, సియానా), తోబి యాంగ్ (సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కాగ్నిజెంట్), స్టాట్ ఆంటోని (పార్టనర్, కోవింగ్టన్ అండ్ బర్లింగ్), ఎమి హరియానీ (సీనియర్ అడ్వయిజర్, యూఎస్ఐబీసీ) , ఇండియాస్పోరా ప్రతినిధులు ముద్దు సుధాకర్ (ఆసియారా), సతీశ్ అంబటి (హెచ్20 ఏఐ), భాస్కర్ శ్రీనివాసన్ (యావియేషన్ టెక్నాలజీ లిమిటెడ్), శ్యామ్ బాలాజీ (డెలాయిట్), సంజయ్ ఖండవేరు (ఐవిక్యాప్ వెంచర్స్), కృష్ణ యార్లగడ్డ (ఫాల్కన్ ఎక్స్), ప్రభ భాష్యం (యాపిల్), ప్రియా రామచంద్రన్ (జోమ్ క్యాపిటల్), రాజీ భాస్కర్ (సూపర్ బ్లూమ్), రాజురెడ్డి (సియారా అట్లాంటిక్), రాకేష్ వైద్య నాథన్ (ధ జై గ్రూప్), రమణన్ షణ్ముగం (ఒవెన్యూ), రావి రవికుమార్ (కోటా క్యాపిటల్), సతీశ్ కంచి (వన్ హబ్, పీఓఎస్), జియా రెహమాన్ (స్ప్రౌట్ ఏఐ), అనిల్ అద్వానీ (ఇన్వెంటస్ లా), నవ దావులూరి, శివచైతన్య (ఇంటరాక్ట్లీ ఏఐ), నవ్య దావులూరి (క్యూరీ ఏఐ), అంజి మారం (క్రిటికల్ రివర్), విశేష్ పువాడి (హెచ్ఎఎస్‌బీసీ), ప్రసాద్ ఆకెళ్ల (ఆప్టెస్సా), సంజయ్ వర్మ (అలిక్స్ పార్టనర్స్), మనోహర్ పాలూరి (మెటా), రాంభూపాల్ (డైకెమ్) కూడా పాల్గొన్నారు.