Jacqueline Fernandez: బేబీ... నేను జైలు నుంచి తిరిగి వస్తున్నా!: జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుఖేశ్ లేఖ

Sukesh Chandrashekhar letter to Jacqueline Fernandez
  • ఢిల్లీ మండోలి జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్
  • దీపావళి సందర్భంగా జాక్వెలిన్‌కు సందేశం
  • త్వరలో జైలు నుండి విడుదలవుతా.. ఈ దీపావళి ప్రత్యేకమైనదన్న సుఖేశ్
ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు జైలు నుంచి దీపావళి పర్వదినం సందర్భంగా ఓ సందేశాన్ని పంపించాడు. ప్రస్తుతం అతను ఢిల్లీలోని మండోలీ జైలులో ఉన్నాడు. ప్రస్తుతం బెయిల్ కోసం ఎదురు చూస్తున్నాడు. బేబీ... నేను త్వరలో తిరిగి వస్తానంటూ జాక్వెలిన్‌కు సందేశం పంపించాడు.

అంతేకాదు, తమ మధ్య ప్రేమబంధానికి రామాయణం వంటి ఇతిహాసాన్ని ఉపయోగించాడు. జాక్వెలిన్‌ను సీతా అని పేర్కొనడంతో పాటు తనను తాను రాముడిగా పేర్కొన్నాడు. త్వరలో తాను జైలు నుంచి బయటకు వస్తానని, ఇది రాముడు వనవాసం నుంచి తిరిగి వచ్చినట్లుగా అంతో పోలిక కూడా పెట్టాడు. ఈ మేరకు ఆయన అక్టోబర్ 31, 2024 తేదీతో లేఖ రాసినట్లుగా ఉంది.

ఈ లేఖలో జాక్వెలిన్‌కు సుఖేశ్ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపాడు. త్వరలో విడుదలయ్యే అవకాశం ఉన్నందున ఈ దీపావళి తనకు ప్రత్యేకమైనదని పేర్కొన్నాడు. తనకు మరో రెండు బెయిల్స్ వస్తే బయటకు వస్తానన్నాడు. "బేబీ, మన ప్రేమకథ మన గొప్ప రామాయణం కంటే తక్కువేమీ కాదు. నా రాముడు తన సీతతో వనవాసం నుంచి తిరిగి వచ్చినట్లుగా నేను కూడా ఈ షార్ట్ వనవాసం (తక్కువ సమయం) నుంచి నా సీత... అదే జాక్వెలిన్ కోసం తిరిగి వస్తున్నాను" అని పేర్కొన్నాడు.

ఇటీవలి జాక్వెలిన్ ప్యారిస్ ట్రిప్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. నలుపు రంగు దుస్తుల్లో ఉన్న ఆమె వేషధారణను మెచ్చుకున్నాడు. బేబీ... ఈ ప్యారిస్ ట్రిప్ కొత్త చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించాడు. చాలా అందంగా కనిపిస్తున్నావని కితాబునిచ్చాడు. ఈ ట్రిప్ ఫొటోల్లో ఏదో ప్రత్యేకత ఉందన్నాడు.
Jacqueline Fernandez
Sukesh Chandrashekhar
New Delhi

More Telugu News