జవాన్ ను పెళ్లి చేసుకోవలసి వస్తే .. సాయిపల్లవి సమాధానం ఇదే!
- 'అమరన్' గా శివకార్తికేయన్
- కీలకమైన రోల్ చేసిన సాయిపల్లవి
- రేపు విడుదలవుతున్న సినిమా
- తన కెరియర్లో గొప్ప మూవీ అవుతుందన్న సాయిపల్లవి
ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. తాజాగా సాయిపల్లవి 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. "ఇది ఒక బయోపిక్ .. ఒక జవాన్ కి వృత్తి పరంగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి. దేశం కోసం పోరాటం చేసే అతనికి ఫ్యామిలీ వైపు నుంచి ఎంతటి సపోర్ట్ ఉంటుందనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. ఈ సినిమాలో నేను ఏ పాత్రనైతే చేస్తున్నానో, నిజ జీవితంలో వారితో నేను 3 గంటల పాటు మాట్లాడిన తరువాత ఒక అవగాహనకి వచ్చాను" అని అన్నారు.
" ఒక ఆర్మీ మెన్ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయనేది నాకు అర్థమైంది. నటిస్తుంటేనే నాకు ఏడుపు వచ్చిందంటే, ఇక రియల్ లైఫ్ ఎలా ఉంటుందనేది ఊహించుకోవచ్చు. సోల్జర్ ను పెళ్లి చేసుకోవలసి వస్తే భయంగానే అనిపిస్తుంది. తప్పదు అంటే నేను స్ట్రాంగ్ అవుతాను .. 'నీతో పాటు నేను కూడా వస్తాను అని చెబుతాను' అంటూ నవ్వేశారు. తన కెరియర్లో ఒక ప్రత్యేక స్థానంలో ఈ సినిమా నిలుస్తుందనే నమ్మకం ఉందని ఆమె చెప్పారు.