shamshabad airport: మూడు విమానాలకు బాంబు బెదిరింపులు.. శంషాబాద్‌లో విస్తృతంగా తనిఖీలు

bomb threat calls to 3 planes at shamshabad airport

  • రెండు హైదరాబాద్- చెన్నై ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు 
  • చెన్నై- హైదరాబాద్ ఎయిర్ ఇండియా విమానానికి కూడా బెదిరింపులు   
  • అప్రమత్తమైన అధికారులు 

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలాన్ని రేపుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు, సిబ్బంది విమానాల్లో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు, చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో శంషాబాద్ ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ వర్గాలు అప్రమత్తమయ్యాయి.

మూడు విమానాల్లో సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు తనిఖీలు చేశారు. ఇదిలా ఉండగా, వారం పది రోజులుగా పలు విమానాలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమవుతున్న అధికారులు విస్తృతంగా తనిఖీలు చేయగా, ఎక్కడా పేలుడు పదార్ధాలు లేకపోవడంతో ఫేక్ బెదిరింపు కాల్స్‌గా నిర్ధారణకు వస్తున్నారు. బెదిరింపు కాల్స్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

  • Loading...

More Telugu News