Bandi Sanjay: కేటీఆర్ లీగల్ నోటీసులు.. మంత్రి బండి సంజయ్ రిప్లై ఇదే!
![Bandi Sanjay Replay to BRS Working President KTR Leagal Notices](https://imgd.ap7am.com/thumbnail/cr-20241029tn6720830f88ef3.jpg)
తన పరువుకు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఫోన్‌ట్యాపింగ్, మాదకద్రవ్యాల వ్యవహారాలలో తనపై నిరాధార ఆరోపణలు చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారంలోపు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
అయితే, తాజాగా కేటీఆర్ లీగల్ నోటీసులపై బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. లీగల్ నోటీసుల్లో కేటీఆర్ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవి, అవాస్తవమని పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగానే తనకు లీగల్ నోటీసులు ఇచ్చారని తెలిపారు.