JEE Main 2025: జేఈఈ మెయిన్-2025 షెడ్యూల్ ఇదిగో!
- జేఈఈ మెయిన్స్ కు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన
- జనవరిలో జేఈఈ సెషన్ -1, ఏప్రిల్ నెలలో సెషన్ – 2ను నిర్వహించనున్న ఎన్టీఏ
- ఫ్రిబవరి 12లోగా సెషన్ -1, ఏప్రిల్ 17లోగా సెషన్ -2 ఫలితాల వెల్లడి
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జేఈఈ (మెయిన్) ఎగ్జామ్స్ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) రిలీజ్ చేసింది. రెండు సెషన్లుగా ఈ పరీక్షలు నిర్వహించనుంది.
జనవరి నెలలో జేఈఈ సెషన్ -1 ను, ఏప్రిల్ నెలలో సెషన్ -2ను నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అక్టోబర్ 28 నుంచి నవంబర్ 22 వరకు జనవరి సెషన్‌కి సంబంధించి ఆన్‌లైన్ లో దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ సెషన్‌కు సంబంధించి 2025 జనవరి 22 నుంచి 31 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ఫలితాలను ఫిబ్రవరి 12 లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ వెల్లడించింది.
సెషన్ -2 కి సంబంధించి జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 24వ తేదీ వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. ఈ సెషన్‌కు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 8వ తేదీ వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ఫలితాలను 2025 ఏప్రిల్ 17లోగా విడుదల చేయనున్నట్లు ఎన్టీఏ తెలిపింది.
.