APMDC: ఏపీఎండీసీ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

ACB searches in APMDC office

  • గత ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయని భావిస్తున్న కూటమి సర్కారు
  • విచారణ ముమ్మరం
  • ఇప్పటికే గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి అరెస్ట్
  • వెంకటరెడ్డి నుంచి సేకరించిన సమాచారంతో నేడు తనిఖీలు

గత ప్రభుత్వ హయాంలో అనేక శాఖల్లో అక్రమాలు జరిగాయని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం... ఈ మేరకు విచారణ ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఏసీబీ నేడు ఏపీఎండీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టింది. గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కేసులో ఏసీబీ ఈ తనిఖీలు నిర్వహించింది. 

వెంకటరెడ్డి ఇప్పటికే ఇసుక టెండర్ల వ్యవహారంలో అరెస్ట్ అయ్యారు. ఆయన ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇటీవల ఏసీబీ అధికారులు వెంకటరెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే నేడు ఏసీబీ అధికారులు ఏపీఎండీసీ కార్యాలయంలో సోదాలు చేపట్టారు.

APMDC
ACB
Search
Venkatareddy
  • Loading...

More Telugu News