Hardik Pandya: కుమారుడి ఒడిలో నిద్రించిన హార్దిక్ పాండ్యా.. నెట్టింట ఫొటో వైర‌ల్‌!

Hardik Pandya rests his head on son Agastya Legs
  • కొడుకు అగ‌స్త్య‌తో ఉన్న క్యూటెస్ట్ ఫొటోను ఫ్యాన్స్‌తో పంచుకున్న హార్దిక్‌
  • అగ‌స్త్య ఆడుకుంటుండ‌గా అత‌డి ఒడిలో నిద్రించిన హార్దిక్ 
  • 'ఇది మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతి' అనే క్యాప్ష‌న్‌తో పిక్‌ను షేర్ చేసిన క్రికెట‌ర్‌
టీమిండియా ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా త‌న కుమారుడికి సంబంధించిన ఓ ఫొటోను సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కొడుకు అగ‌స్త్య ఆడుకుంటుండ‌గా హార్దిక్ అత‌డి ఒడిలో నిద్రించాడు. 

ఈ క్యూటెస్ట్ ఫొటోను పాండ్యా త‌న ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నాడు. 'ఇది మాట‌ల్లో చెప్ప‌లేని అనుభూతి' అనే క్యాప్ష‌న్‌తో పిక్‌ను షేర్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ క్యూటెస్ట్ ఫొటో అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ఇదిలాఉంటే.. ప్ర‌స్తుతం హార్దిక్ వ‌చ్చే నెల 8 నుంచి దక్షిణాఫ్రికాతో జ‌రిగే నాలుగు టీ20 మ్యాచ్‌ల‌ సిరీస్‌కు ముందు కొంచెం విరామం దొర‌క‌డంతో ఆ విలువైన స‌మ‌యాన్ని త‌న కుమారుడితో గ‌డుపుతున్నాడు. ఇందులో భాగంగానే ఆదివారం త‌న కొడుకు అగ‌స్త్య‌తో దిగిన ఫొటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. 

ఇక న‌టాషా, హార్దిక్ విడాకుల అనంత‌రం అగ‌స్త్య త‌న పెద్ద‌మ్మ పాంఖురి వ‌ద్దే ఉంటున్నాడు. ఈ చిన్నారి ఆల‌నాపాల‌నా తనే చూస్తోంది. 
Hardik Pandya
Agastya
Team India
Cricket
Sports News

More Telugu News