Chandrababu: ఏపీ డీజీపీ కుమార్తె పెళ్లికి హాజరైన సీఎం చంద్రబాబు

Chandrababu attends AP DGP daughter wedding
  • ఇవాళ ఏపీ, తెలంగాణల్లో వివాహాలకు చంద్రబాబు హాజరు
  • విజయవాడలో ఏబీఎన్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి వివాహం
  • హైదరాబాదులో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె సోనాక్షి పెళ్లి
  • వధూవరులకు ఆశీస్సులు అందించిన ఏపీ సీఎం
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఏపీ, తెలంగాణల్లో వివాహాలకు హాజరయ్యారు. విజయవాడలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ రామారావు కుమారుడి పెళ్లికి విచ్చేశారు. ఇక, ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కుమార్తె గాయత్రి సోనాక్షి వివాహం హైదరాబాద్ లో జరగ్గా... ఈ పరిణయ మహోత్సవానికి కూడా చంద్రబాబు హాజరయ్యారు. నూతన వధూవరులు గాయత్రి సోనాక్షి, రుత్విక్ సాయికి ఆశీస్సులు అందించారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
Chandrababu
AP DGP Daughter
Wedding
Hyderabad

More Telugu News